స్టైల్ అంటే రజనీ.. రజనీ అంటే స్టైల్.. ఇలా తన బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్న రజనీకాంత్, రోబో-2 షూటింగ్లో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు. యాక్షన్ అనగానే ఎంత స్టైల్‌గా మారిపోతారో.. ప్యాకప్ చెప్పగానే ఎవరూ గుర్తుపట్టనంత నిరాడంబరత జీవితం గడిపేస్తుంటారు సూపర్‌స్టార్ రజనీకాంత్. సీనియర్ నటుడు శివకుమార్ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిజేసేందుకు రాసిన ఓ లేఖలో రజనీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా రజనీ కాంత్ తనలోని చెడు వ్యసనాల్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ఎటువంటి సంశయం వ్యక్తం చేయలేదు. ఆ లేఖలో శివకుమార్ గురించి ప్రస్తావిస్తూ.. ‘కెరీర్ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో జీవితపాఠాలు నేర్చుకున్నాను. అప్పట్లో నాకు మద్యం, సిగరెట్ తాగే అలవాట్లుండేవి. గొప్ప నటుడిగా ఎదగాలంటే ముందు నువ్వీ అలవాట్లన్నీ మానుకోవాలని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని శివకుమార్ నాకు మంచి సలహాలు ఇచ్చేవారు.
శివకుమార్ ఓ మహోన్నతమైన వ్యక్తిత్వం. చెడు వ్యసనాలతో నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా కాని ఆయన ఇచ్చిన ఆరోగ్య సలహాలు పాటించి శారీరకంగా, మానసికంగా బలపడ్డాను. అలాంటి వ్యక్తికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని రజనీ శివకుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 1977లో వచ్చిన కవికూయిల్, భువన ఒరు కెల్వికురి చిత్రాల్లో రజనీ, శివకుమార్‌లు కలిసి నటించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన సూర్య, కార్తీలు శివకుమార్ కుమారులు.
ఇటీవల వైద్య పరీక్షలకు అమెరికాకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న ఉదయం రజనీకాంత్ ను పోయస్ గార్డెన్ లోని ఆయన ఇంట్లో చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఆయనను దీపావళి రోజున శాలువాలతో సన్మానించి ఆభినందించారు. ఈ సందర్భంగా తాజా చిత్రం, రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన ‘కబాలీ’ 100 రోజుల సెలబ్రేషన్స్ ను సైతం అభిమానులు సందడిగా జరుపుకున్నారు. వచ్చే ఏడాది రోబో సీక్వెల్ ‘2.0’ విజయవంతంగా జరుపుకుంటామని అభిమానులు రజనీతెలిపారు. ఇటీవల ‘కబాలి’ చిత్రంతో అభిమానులను అలరించిన ఆయన త్వరలో ‘రోబో-2’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.