కూలీ వర్సెస్ వార్ 2!

1
- Advertisement -

లోకేశ్‌ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కూలీ. నాగార్జున వి,కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్,బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రజనీ కెరీర్‌లో ఇది 171వ సినిమా . సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అగ్ర న‌టులు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండిపెండెన్స్ కానుక‌గా ఆగష్టు 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఇక ఇదే రోజు హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్న వార్ 2 రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా ఆగష్టు 14నే విడుద‌ల కాబోతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద జరిగే ఈ వార్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాలి.

Also Read:వైరల్‌ వీడియో..బైకర్‌ను లాక్కెళ్లిన బస్సు!

- Advertisement -