మెర్సల్‌ మూవీపై రజనీ ట్వీట్‌..

204
- Advertisement -

తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్ ‘ సినిమాపై వివాదం చెలరేగిన సంగతి తెలిసందే. ఆ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ.. ఆ డైలాగులను వెంటనే తొలగించాలని తమిళనాడు బీజేపీ నేతలు చిత్ర నిర్మాతలకు సూచించారు. ఇండియాలో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవని వైద్యులు కార్పొరేట్ హాస్పిటళ్ల తీరుపై విజయ్ పేల్చిన సెటైర్లపై డాక్టర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మెర్సల్’ వివాదంపై విశ్వనటుడు కమల్ హాసన్, హీరో విజయ్ తండ్రి ,సినీ నిర్మాత చంద్రశేఖర్,రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌లు కూడా బాసటగా నిలిచారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వివాదంపై స్పందించారు. మెర్సల్‌ సినిమాకు మద్దతు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రజనీ చేసిన ట్వీట్ మీడియా – సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాట రజనీకాంత్ ట్వీట్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే త్వరలో తలైవా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Rajinikanth tweets support for 'Mersal'

రజనీ బీజేపీలో చేరనున్నారని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతారని పుకార్లు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో రజనీకాంత్ మెర్సల్ కు మద్దతుగా ఆసక్తికర ట్వీట్ ఒకటి చేశారు. చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు….చాలా బాగా చేశారు….మెర్సల్ టీమ్ అందరికీ అభినందనలు…” అని రజనీ ట్వీట్ చేశారు. అయితే రజనీ ఏ అంశాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు? అన్న విషయంపై తమిళ నాట పెద్ద చర్చ జరుగుతుంది. రజనీ….మెర్సల్ సినిమాలోని అంశాల గురించి ట్వీట్ చేశారా? లేకుంటే ఆ సినిమాపై చెలరేగిన వివాదాలపై స్పందించారా? అని పలువురు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం మెర్సల్ వివాదం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో రజనీ నర్మగర్భంగా ఆ ట్వీట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రజనీ చేసిన ట్వీట్‌ హాట్ టాపిక్ అయిన ఈ వివాదం పై స్పందించకపోతే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లే అవకాశముండడంతోనే రజనీ ఈ రకంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. మెర్సల్ లో బీజేపీ ప్రవేశపెట్టిన జీఎస్టీ – డిజిటల్ ఇండియా విధానాలపై సెటైర్లు వేశారని బీజేపీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో రజనీ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఆ ట్వీట్ ను బట్టి రజనీ భవిష్యత్తులో బీజేపీతో జత కట్టకపోవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -