రజనీ @ ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ

399
rajanikanth
- Advertisement -

తమిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత సినిమాలకు రజనీకాంత్ చేసిన సేవలకు గుర్తింపుగా ఐకాన్ ఆఫ్‌ ది గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన జవదేకర్‌… ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా 2019 అవార్డ్స్‌లో ఈ సత్కరాన్ని అందిస్తామన్నారు. ర‌జనీకాంత్‌కు ఈ అవార్డును ప్ర‌క‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

నవంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేష‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌గనుండగా వివిధ దేశాల‌కు చెందిన 250 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

- Advertisement -