రజనీకాంత్ కన్నీళ్లే ఇప్పుడు హాట్ టాపిక్

19
- Advertisement -

విష్ణు విశాల్‌ హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ‘జైల‌ర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తర్వాత చేస్తున్న సినిమా ఈ లాల్‌సలామ్‌. పైగా రజినీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది కాబట్టి, రజనీ ఫ్యాన్స్ కి ఈ సినిమా ప్రత్యేకం అయ్యింది. దీంతో, ఈ మూవీపై రజినీ అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వాటిని మరింత పెంచుతూ.. మూవీ టీం జలాలీ సాంగ్ రిలీజ్ చేసింది. ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహమాన్, శరత్ సంతోష్ క‌లిసి ఈ సాంగ్ ను పాడారు.

‘లాల్‌ సలామ్’ నుంచి జలాలీ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ ను సాధించింది. మరి, రజనీ అతిథి పాత్ర పోషించిన సినిమా కాబట్టి, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆ మాత్రం అంచనాలు ఉంటాయి. పైగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆయన సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్‌ సలామ్‌’లో నటించేవారు కాదు’’ అని పేర్కొన్నారు. ఐతే, ఐశ్వర్య మాటలు విన్న రజనీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

దీంతో, ఈ ‘లాల్‌సలామ్’ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చి చేరింది. మరోవైపు జైలర్ మూవీ ఈవెంట్‌లో ‘అర్థమయిందా రాజా’ అంటూ తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎమోషనల్ అవుతూ చెప్పారు. దళపతి విజయ్‌పై తాను విమర్శలు చేశానని అనడం బాధించిందని సూపర్ స్టార్ చెప్పుకొచ్చారు. విజయ్ తన కళ్ల ముందే పెరిగాడని.. టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి చేరాడని రజనీకాంత్ కొనియాడారు. తనకు తానే పోటీ అని రజనీ కామెంట్స్ చేయడం విశేషం. మొత్తానికి రజనీకాంత్ కన్నీళ్లే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Also Read:రాష్ట్రానికి అమిత్ షా..షెడ్యూల్ ఇదే

- Advertisement -