మిరాయ్‌..రజనీ ప్రశంసలు!

7
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే చిత్రయూనిట్ వేగవంతం చేయగా తాజాగా సినిమా ట్రైలర్‌ని చూశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. రజినీకాంత్ తన ఐఫోన్‌లో ట్రైలర్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న ఫొటోలను మంచు మనోజ్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం, రజినీకాంత్ సినిమా కథ, తన నటనను ప్రశంసించారని, ఆ ప్రశంసలను తాను “నిజమైన ఆశీర్వాదం”గా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, తమిళనాడు ప్రజలు, మీడియా అందిస్తున్న అండదండలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రంలో రిథికా నాయక్, శ్రీయా శరణ్, జగపతి బాబు తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తోంది.

Also Read:KTR:ఆదర్శ్‌ ఉన్నత శిఖరాలు అదిరోహించాలి

- Advertisement -