ఓ వైపు సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇక తమిళనాట అన్నాడీఎంకే,డీఎంకేతో పాటు రజనీ,కమల్ పోటీలో ఉండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. అయితే గతంలో ఇచ్చినమాటకే కట్టుబడ్డ రజనీ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని చెప్పిన రజనీ లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టేది లేదని చెప్పారు. అంతేగాదు తన మద్దతు ఏ పార్టీ ఇవ్వడం లేదని చెప్పారు. తన పేరుతో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ నేతలు,ఫ్యాన్స్‌కు సూచించారు రజనీ.
మక్కల్ మంద్రమ్ అనే పార్టీని స్థాపించిన రజనీ అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే మరోవైపు కమల్ మాత్రం లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.