రజనీ…సంచలన నిర్ణయం

229
rajinikanth
- Advertisement -

2019 ఎన్నికల నామ సంవత్సరం. మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలన్ని ముందస్తు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక దక్షిణాది విషయానికొస్తే తమిళనాట పాలిటిక్స్‌కు ఉన్న క్రేజే వేరు. సినీనటుల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఇక్కడిరాజకీయాల్లో ఈసారి మరో ఇద్దరు సూపర్‌ స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

విలక్షణ నటుడు కమల్‌..మక్కల్ నీది మయ్యమ్‌ అనే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగుతుండగా సూపర్ స్టార్ రజనీ నేను సైతం అంటూ మక్కల్ మంద్రమ్‌ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపనే కాదు వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో ఉంటారని ప్ర‌క‌టించాడు రజనీ.

దీంతో తమిళ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయట్లేదని స్పష్టం చేశాడు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ..నా పేరు, గుర్తు ఎవ‌రు వాడ‌కూడ‌దని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లోఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అయితే కమల్‌ హాసన్ మాత్రం లోక్‌ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుగుర్రాలను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -