సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘జైలర్’ .యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుండగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలు,ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉండగా లేటెస్ట్ గా జైలర్ రన్ టైం పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 49 నిమిషాల రన్ టైం ఉండనుందట. తెలుగులో కూడా ఇదే రన్ టైంతో విడుదల కానుందట.
Also Read:బొప్పాయి తింటే గర్భం పోతుందా?
జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తుండగా మోహన్‌లాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.విజయ్ కార్తీక్ కన్నన్ కెమరామెన్ గా పని చేస్తుండగా ఆగస్టు 10న విడుదల కానుంది.
Also Read:SIIMA Awards 2023:RRR Vs సీతారామం!