నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లెటెస్ట్ మూవీ ‘జైలర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ‘జైలర్’ మూవీ ఎలా ఉందటే.. ఒకప్పటి జైలర్.. తన కుటుంబం కోసం మాఫియాతో యుద్ధం చేసి ఎలా గెలిచాడన్నదే ఈ కథ. సినిమాలో రజనీ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే అలరిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్లో ట్విస్ట్ అదిరిపోయింది. అయితే ఫస్టాఫ్ స్లోగా సాగడం సినిమాకి మైనస్. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఇక సెకండ్ హాఫ్ అయితే అంచనాలను అందుకోలేకపోయింది. అయితే కొన్ని కామెడీ సీన్లు మాత్రం బాగున్నాయి.
మొత్తానికి ఈ జైలర్ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. టాక్ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీ స్థాయిలో వస్తున్నాయి. అటు అమెరికాలో కూడా 340 లొకేషన్స్‌లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టగా.. టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయి. 815 షోలకు గాను 37,116 టికెట్లు అమ్మగా 8 లక్షల డాలర్లకు( భారత కరెన్సీలో రూ.6.64కోట్లు) పైగా వచ్చింది. రజినీ క్రేజ్ తో జైలర్ రికార్డు కలెక్షన్లు రాబడుతున్నాడు. ఇదిలా ఉంటే.. జైలర్ సినిమా విడుదల సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read:కాళేశ్వరం క్రెడిట్.. ఎవరిది?
నేడు తన సినిమా విడుదల ఉందనగానే ఆయన నిన్నే హిమాలయాలకు వెళ్లారు. మనశ్శాంతి కోసం వీలు కుదిరినప్పుడల్లా సూపర్ స్టార్ హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. అయితే, కొవిడ్ మహమ్మారి వల్ల గత నాలుగేళ్లుగా ఆయన అక్కడికి వెళ్లలేదు. అందుకే జైలర్ సినిమా విడుదల సందర్భంగా సూపర్ స్టార్ హిమాలయాలకు వెళ్ళారు. వచ్చే వారంలో రజినీకాంత్ తిరిగి చెన్నై రానున్నారు.
Also Read:Independence Day:బాలీవుడ్‌కి ధీటుగా టాలీవుడ్