తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఫార్మా కంపెనీ అధినేత విషగన్ వనగమూడితో సౌందర్య రజనీకాంత్‌తో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాలకు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు మాత్రమే హాజరయ్యారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో నిర్వహించారు. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో సౌందర్య బంగారు వర్ణం పట్టుచీరలో, వరుడు పట్టు వస్ర్తాల్లో మెరిశారు. ఈ నెల 11న చెన్నైలో వీరి వివాహం ఘనంగా జరగనుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య 2010లో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళ తర్వాత వారి ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరూ విడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరి కుమారుడు వేద్ కృష్ణ సౌందర్య దగ్గరే ఉంటున్నాడు.