తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్!

194
- Advertisement -

తెలంగాణ గవర్నర్‌గా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జైలర్‌తో సూపర్ డూపర్ హిట్ కొట్టారు రజనీ. ఇక త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీని గవర్నర్‌గా నియమిస్తే తమిళనాడుతో పాటు తెలంగాణలో ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా రజనీని తెలంగాణ గవర్నర్‌గా నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి రజనీ పొలిటికల్ పార్టీ స్ధాపించినప్పుడు కూడా బీజేపీతో సన్నిహితంగానే మెలిగారు. అయితే తన ఆరోగ్యం సహకరించకపోవడంతో పొలిటికల్ ఎంట్రీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సినిమాలతో బిజీగా ఉండగా తాజాగా రజనీకాంత్‌ గవర్నర్‌గా నియమితులు కానున్నారని ఆయన సన్నిహితులే సమాచారాన్ని లీక్ చేస్తున్నారు.

తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు క్రేజ్ ఉంది. ఇక ఇటీవల జైలర్ సినిమాతో ప్రభంజనమే సృష్టించారు రజనీకాంత్. దాదాపు రూ.640 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Also Read:చర్లపల్లి ఓపెన్ జైలులో గ్రీన్ ఛాలెంజ్

- Advertisement -