ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్, కమల్, శృతి హాసన్

171
Rajinikanth Kamal hasan cast her Vote

ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 11రాష్ట్రాల్లో 96పార్లమెంట్ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఉదయం నుంచే పోలింగ్ బూత్ లకు ఓటర్లు క్యూ కట్టారు. సెలబ్రెటీలు కూడా సామాన్యుల లైన్లలోనే క్యూ కట్టి ఓట్లు వేస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ నియోజవర్గంలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు. అలాగే తమిళ సూపర్ స్టార్, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌లు చెన్నైలోని ఆళ్వార్‌పేట కార్పొరేషన్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలోనూ ఓటుహక్కు వినియోగించుకున్నారు.