400కోట్ల క్ల‌బ్ లో 2.ఓ..

270
2.o
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన మూవీ 2.ఓ. బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, అమీ జాక్సాన్ క‌థానాయిక పాత్ర పోషించింది. న‌వంబ‌ర్ 30న విడుద‌లైన ఈసినిమా రికార్డు సృష్టిస్తుంది. బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్నింటిని తిర‌గ‌రాసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈచిత్రానికి అన్నీ ప్రాంతాల నుంచి మంచి రెస్పాస్స్ వ‌స్తుంది.

rajinikanth

విడుదలైన తొలి రోజునే ఈ సినిమా 100 కోట్లను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. తెలుగు .. తమిళ.. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తుంది. తాజాగా ఈమూవీ విడుద‌లైన 4రోజుల్లోనే 400కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దాదాపు 600కోట్ల‌తో నిర్మించిన ఈసినిమాకు 4రోజుల్లోనే 400కోట్లు రావ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు.

akshay

ద‌ర్శ‌కుడు శంక‌ర్, ర‌జ‌నీకాంత్ లైఫ్ లోనే ఇది భారీ బ‌డ్జెట్ మూవీ. యూఎస్ లో కూడా 2.ఓ మూవీ రికార్డులు తిరిగ‌రాస్తుంది. యూఎస్ఏలో తొలి నాలుగు రోజుల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ సినిమాల రికార్డులను ఈ సినిమా అధిగమించింది.

- Advertisement -