సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది.
రోబో చిత్రానికి సీక్వెల్‌గా రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లో 2.0 చిత్రం రూపొందుతోందన్న వార్త బయటికి రాగానే ఈ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే బిజినెస్ పరంగా ‘2.0’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. శాటిలైట్ రైట్స్ కోసం కూడా భారీ పోటీ నెలకొంది. అంతటి పోటీ మధ్య జీ టివి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల శాటిలైట్ రైట్స్‌ను 110 కోట్లకు జీ తెలుగు కైవసం చేసుకుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘రోబో’ తర్వాత రజనీకాంత్, శంకర్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ శాటిలైట్ రైట్స్ 110 కోట్లకు అమ్ముడు పోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.