- Advertisement -
భారత ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 1960 ఫిబ్రవరి 19న జన్మించిన రాజీవ్ కూమార్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.
అనంతరం పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన రాజీవ్ కుమార్ ఆగస్టు 31 వరకు ఆ పోస్టులో ఉన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన విధులు నిర్వహించనున్నారు.
- Advertisement -