న్యూఇయర్‌ వేడుకలు..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

161
rajeev
- Advertisement -

నూతన సంవత్సరం వేడుకలు, శీతాకాలం నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

సూపర్ స్పైడర్ ఈవెంట్స్, జన సమూహం ఉండే వేడుకలను అరికట్టేందుకు పటిష్ఠ నిఘా పెట్టాలని సూచించింది.రాష్ట్రాల సీఎస్ లకు తాజాగా కేంద్ర హోంశాఖ రాసిన లేఖను ప్రస్తావించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.

కరోనా నియంత్రణకు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ వంటి పరిమితులను విధించవచ్చని సూచించింది కేంద్ర హోంశాఖ.ఈ నేపథ్యంలో డిసెంబర్ 30, 31, జనవరి 1 న తగిన ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణించాలని సూచించింది.

- Advertisement -