రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలవడం వెనుక విరాట్ కోహ్లీ అనుభవం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు కెప్టెన్ రజత్ పటిదార్. ఈ చారిత్రాత్మక విజయం వెనుక విరాట్ కోహ్లి చూపిన ప్రభావం మరియు మార్గదర్శకత్వం ఎంతగానో ఉన్నాయని కొనియాడాడు. విరాట్ కోహ్లి లాంటి దిగ్గజ ఆటగాడు జట్టులో ఉండటం తమకు దక్కిన గొప్ప అవకాశమని…ఆయన నుండి ప్రతి ఒక్కరూ ఎంతో నేర్చుకోవచ్చని పటిదార్ పేర్కొన్నాడు.
మైదానంలో విరాట్ భాయ్ ఉన్నప్పుడు జట్టులోని మిగతా ఆటగాళ్లలో నమ్మకం, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. ఆయన పరుగుల ఛేజింగ్‌లో ఎంతటి ఒత్తిడినైనా చాలా సులువుగా ఎదుర్కొంటారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆయనకు కాలి కండరాలు పట్టేసినా (గాయమైనా) జట్టు కోసం క్రీజులోనే ఉండి మ్యాచ్‌ను ముగించారు. ఆయన ఆట తీరు, క్రమశిక్షణ చూసి మేమంతా ఎంతో నేర్చుకుంటున్నాం అన్నాడు.
రికార్డుల గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదు….జట్టుగా సమిష్టిగా రాణించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అన్నారు. ముఖ్యంగా మా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగం గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తోంది అని పటిదార్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కోహ్లి కేవలం 25 బంతుల్లోనే తన కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించి… 42 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.
Also Read:మౌంట్ రష్‌మోర్‌పై ట్రంప్..!

