ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్..

3
- Advertisement -

ఐపీఎల్ 2025 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది ఆర్సీబీ. స్టార్ ఆటగాడు రజత్ పాటిదార్ ఐపీఎల్‌లో ఆర్సీబీకి నాయకత్వం వహిస్తాడని వెల్లడించిది ఆ జట్టు యాజమాన్యం.2024లో ఆర్సీబీకి కెప్టెన్‌గా పనిచేశాడు డూప్లెసిస్. ఓవరాల్‌గా పాటిదార్ ఆర్సీబీకి ఎనమిదవ కెప్టెన్.

పాటిదార్ కంటే ముందు రాహుల్ ద్రావిడ్, కేవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డేనియల్ వెటోరి, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌లు పని చేశారు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆర్సీబీ కప్ గెలవలేదు. 2009, 2011, 2016 సీజన్లలో పీటర్సన్, వెటోరి, కోహ్లీ నాయకత్వంలో రన్నరప్‌గా నిలిచింది ఆర్సీబీ.

పాటిదర్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ. జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించాడు కోహ్లీ. ఆర్సీబీ ఫ్రాంచైజీలో నువ్వు ఎదిగిన తీరు, ప్రదర్శించిన ఆటతీరు నిజంగా అద్భుతం అని కొనియాడాడు.

Also Read:వీడియో..మళ్లీ కొట్టుకున్న హర్భజన్, అక్తర్!

- Advertisement -