బాలీవుడ్ బెబో కరీనాకపూర్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఆమెకి సంబంధించిన ఈ పిక్ సోషల్‌మీడియాలో వీరవిహారం చేస్తోంది. సమయం, సందర్భం ఏంటన్నది కాసేపు పక్కనబెడితే సినీ లవర్స్‌ని విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంటోంది. గతంలో కంటే బెబో ఇప్పుడే బాగుందని కొందరు, ఈ లుక్ ఏ మూవీ అంటూ మరికొందరు, మ్యారేజ్ తర్వాత కరీనాని ఇలా చూడ లేదని ఇంకొందరు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. హిందు స్పిర్చువాలిటీ అండ్ సర్వీస్ ఫౌండేషన్ అనే సంస్థ రాజస్థాన్‌లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ఎప్‌ఎఫ్ విడుదల చేసిన కరీనా కపూర్ ఖాన్ ఫొటో అత్యంత వివాదాస్పదంగా మారింది.
కరీనా ఫొటోను, బుర్ఖా వేసుకున్న మరో మహిళ ఫొటోతో మార్ఫింగ్ చేసి.. లవ్ జిహాద్ వలలో చిక్కుకుంటే.. మీరు ఇలా అవుతారంటూ విద్యార్థులకు హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు బోధిస్తున్నారు. ఈ కరపత్రాన్ని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ బహిరంగ ప్రదేశాల్లో పంపిణీ చేస్తోంది. ముస్లిం, క్రైస్తవ మతాలు చేస్తున్న మతమార్పిడి మోసాలను విద్యార్థులకు తెలియచెప్పేందుకే ఇలా చేస్తున్నట్లు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక పెంపెందించే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ అవగాహన కార్యక్రమాల్లో రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులంతా హాజరు కావాలని అక్కడి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ అవగాహనా కార్యక్రమాల్లో హిందూ జీవన విధానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ బోధించనుంది.