- Advertisement -
ఐపీఎల్-15లో క్వాలిఫయర్-2 మ్యాచ్లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ చావోరేవో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్, బెంగళూరు జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు-సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్, యజువేంద్ర చహల్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు-ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజెల్ వుడ్, మహ్మద్ సిరాజ్.
- Advertisement -