- Advertisement -
మొన్న గుజరాత్..ఇవాళ రాజస్థాన్..వెరసీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రారంభానికి ముందే కొట్టుకుపోయింది రోడ్డు. రాజస్థాన్ రాష్ట్రంలో జుంజును జిల్లాలో వర్షానికి కొట్టుకుపోయింది పాప్రా, పాంచ్‌లాగి గ్రామాలను కలిపే రోడ్డు.
ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చుట్టు పక్కన ఊర్లలో నివసించే ప్రజలు. రోడ్డు కొట్టుకుపోయిన చోట దాదాపు 35 అడుగుల గుంత ఏర్పడడంతో, రోడ్డు నిర్మాణం ఎంత నాసిరకంగా జరిగిందో అర్థమవుతుందని మండిపడుతున్నారు గ్రామస్తులు.
Also Read:బెట్టింగ్ యాప్స్ కేసు..ఈడీ ఎంటర్!
ఇలాంటి నాసిరకమైన నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Advertisement -

