స్మార్ట్‌ఫోన్‌ల కాలంలోనూ దయ్యాలు, భూతాలు ఏంటనుకుంటున్నారా..! ఇదేదో మారుమూల గ్రామంలోనో..చదువులేని వారు చెబుతున్న విషయం కాదు. ఏకంగా ఓ రాష్ట్ర అసెంబ్లీలో. అది ఎమ్మెల్యేలు దయ్యాలై తిరుగుతున్నాయట. ఎమ్మెల్యేలు దయ్యాలై తిరుగుతున్నారని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు 200 మంది ఏకకాలంలో ఇంతవరకూ హాజరు కాలేదు.
ఇటీవల చనిపోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్మలుగా మారి తిరుగుతున్నారని, చాలా మందికి కనపడ్డారని చెబుతూ, సెక్రటేరియేట్ లోకి అడుగు పెట్టేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. వెంటనే సీఎం వసుంధరా రాజే స్పందించి, భూత వైద్యలను పిలిపించాలని, వివిధ మతాల ప్రార్థనలు జరిపించి, దెయ్యాలను తరిమివేయలేకపోతే తాము రాలేమని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్న పరిస్థితి.
కాగా, ఈ సెక్రటేరియేట్ ను 2001లో నూతనంగా నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ స్మశానం ఉండేదట. అందువల్లే చనిపోయిన ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్ రెహ్మాన్ వ్యాఖ్యానించారు. వాటిని తరిమేందుకు ప్రత్యేక పూజలు చేయాలని తాను రాజేకు చెప్పినట్టు ఆయన తెలిపారు
అయితే ఈ రూమర్లను మరికొందరు ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. దెయ్యాలున్నాయని చెప్తున్న ఎమ్మెల్యేలు ధైర్యవంతులు కాదని, తమకు ఎలాంటి దెయ్యాలు కనిపించలేదని వారు కొట్టిపడేస్తున్నారు.