ప్రజలతో నాయకులు మంచిగా ఉన్నంత వరకే మర్యాద ఇస్తారు. కాదు నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే మాత్రం పరిణామాలు ఇంకోలా ఉంటాయి. అందుకు ఉదాహరణ, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేని.. ప్రజలు తరిమికొడుతున్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టీ, ఎస్సీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారించిన తరువాత చట్టానికి వ్యతిరేకంగా తీర్పురావడంతో ప్రజలు నిరసన తెలుపుతున్నారు.
అదే సమయంలో అక్కడికి గంగాపూర్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ నేత రంకేశ్ మీనా అక్కడికి వచ్చి.. వారితో ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆగ్రహానికి గురయ్యారు. ఆ మాజీ ఎమ్మెల్యేను తరిమి తరిమి కొట్టారు. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టగా వైరల్ అయింది. ముందుగా ఆ వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ అని ప్రచారం జరిగింది. తనపై దుష్ప్రచారం జరగడంతో ఇంతకు ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలని తన అనుచరులకు శంకర్ లాల్ శర్మ ఆదేశించారు.
అనుచరులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారించగా.. గతంలో బీఎస్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ లోకి వెళ్లిన రంకేశ్ మీనా అని తేలింది. ఈ విషయంపై రంకేష్ మీనాని మీడియా సంప్రదించగా.. ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. నిజాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.
https://www.youtube.com/watch?v=vtmxdg5Bl_w