కల్కి తర్వాత గరుడవేగ 2: రాజశేఖర్

339
kalki
- Advertisement -

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’, ‘ఎవరో ఎవరో’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ… నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, రవిరాజా పినిశెట్టిగారు… నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. సి. కల్యాణ్‌గారిని ఇంత కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా బిగినింగ్‌లో చూశా. ఈ మధ్య చూసింది లేదు. ఆయన సంతోషానికి కారణం ‘కల్కి’. నేనింకా సినిమా చూడలేదు. జస్ట్‌ మూడు రీళ్లు మాత్రమే చూశా. ఎందుకంటే… ఫీల్‌ ఎలా ఉందని! ఈ సినిమాలో నేను నటించినా… నెక్ట్స్‌ ఏం వస్తుందోననేది ఊహించలేకపోయా. పోను పోను సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలు ఫస్టాఫ్‌ వరకు చూడమన్నారు. నేను చూడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే… సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దీనంతటికీ కారణం ప్రవీణ్‌ సత్తారుగారు. ఆయన నాకు ఒక మార్క్‌ సెట్‌ చేశారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా అన్నారు.

జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి వచ్చిన ప్రవీణ్‌ సత్తారుగారికి థ్యాంక్స్‌. ‘గరుడవేగ’తో రాజశేఖర్‌గారి ఇమేజ్‌ని తీసుకువెళ్లి ప్రవీణ్‌ సత్తారుగారు ఎక్కడో పెట్టారు. ఆ సినిమా తర్వాత చాలా కథలు విన్నాం. ‘గరుడవేగ’ హిట్‌ కావడంతో చాలామంది నిర్మాతలు సినిమా చేయడానికి వచ్చారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్స్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు.

ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందే హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పే విధంగా మోషన్‌ పోస్టర్‌, టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, ఇప్పుడీ హానెస్ట్‌ ట్రైలర్‌ డిజైన్‌ చేశాం. కమర్షియల్‌ ట్రైలర్‌ విడుదలైన తర్వాత చాలామంది ‘కల్కి’ని ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో కంపేర్‌ చేశారు. సినిమాలో కామెడీ, ఐటమ్‌ సాంగ్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. నాలుగు థీమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అవి మూడు భాషల్లో ఉంటాయి’’ అన్నారు.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

- Advertisement -