గరుడవేగ…సెన్సార్ పూర్తి

212
Rajashekar Garuda Vega gets U\A
- Advertisement -

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడు వేగ 126.18ఎం`.

నవంబర్‌ 3న  భారీ స్థాయిలో సినిమా విడుదలవుతుండగా సినిమా ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.  తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా  కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమా  25 కోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కింది.

సినిమా ట్రైలర్‌ని బాలకృష్ణ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్  అందరిని అలరించనున్నట్లు చిత్రయూనిట్ చెబుతోంది. దీంతో పాటు సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.  చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రాజశేఖర్, ఈ సినిమాతో తనకి   పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు.

- Advertisement -