“కల్కి” మోషన్ పోస్టర్ అదిరిపోయింది..!

181
Rajasekhar's Kalki motion poster released

“అ!” సినిమాతో సినీ ఇండస్ట్రీ కి పరిచయమైన ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో, డాక్టర్ రాజశేఖర్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రానికి “కల్కి ” అనే టైటిల్ ఖరారైపోయింది. అంతే కాదు మోషన్ టైటిల్ ను కూడా విడుదల చేసేసింది చిత్ర బృందం. రాఖీ పండగ సందర్భంగా రిలీజ్ ఐన మోషన్ టైటిల్ ఎంతో వినూత్నంగా వైవిధ్యభరితంగా ఉండి చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాదు, మోషన్ టైటిల్ లో ఓ నిగూఢ అర్ధం కూడా దాగి ఉంది.

Rajasekhar's Kalki motion poster released

మోషన్ టైటిల్ లో మహా విష్ణువు యొక్క దశావతారలకు సంబంధించిన ఆయుధాలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, వాటన్నిటిని కలపి చివరికి కల్కి అనే టైటిల్ ను ప్రదర్శించడం చూపారులదృష్టిని బాగా ఆకట్టుకుంటుంది. మోషన్ పోస్టర్ని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన చిత్రబృందం, సినిమాని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో అని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా రాజశేఖర్ ని ఓ కొత్త అవతారంలో చూడబోతున్నామని సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఉత్సుకతతో వేచి చూస్తున్నారనే చెప్పాలి.

Dr. Rajasekhar’s Kalki Title Motion Poster | A Prasanth Varma Film