బాలయ్య మూవీలో విలన్‌గా రాజశేఖర్‌..?

289
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ యాంగ్రీ మ్యాన్‌ రాజశేఖర్‌ ఇద్దరూ సీనియర్ నటులే. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాళ్లే. అయితే బాలయ్య హీరోగా సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు. కానీ రాజశేఖర్ మాత్రం అదే హీరో ట్యాగ్ ను కంటిన్యూ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. అందుకే ఇప్పుడు బాలయ్య సహకారంతో రూటు మార్చాలనుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బాలయ్య సినిమాలో రాజశేఖర్ కనిపించబోతున్నాడు. అది కూడా ప్రతినాయకుడిగా. బాలయ్య సినిమాతో తను విలన్ గా మారబోతున్న విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ప్రకటించాడు. గరుడవేగ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజశేఖర్.

Rajasekhar Turn as villain for Balayya Movie?

జగపతిబాబు లాంటి సీనియర్ హీరో, బాలయ్య సినిమాతోనే విలన్ గా మారాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అందుకే రాజశేఖర్ కూడా బాలయ్య సినిమాతోనే విలన్ గా మారాలనుకుంటున్నాడు. మరోసారి నటుడిగా బిజీ అవ్వాలనుకుంటున్నాడు. బాలయ్య హీరోగా, రాజశేఖర్ విలన్ గా ఓ స్టోరీలైన్ రాసుకున్నాడట దర్శకుడు ప్రవీణ్ సత్తారు. సినిమా స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందట. ఈ ప్రాజెక్టుతోనే విలన్ గా ఎంట్రీ ఇస్తాడట రాజశేఖర్. అయితే ఈ సినిమా సాకారం అవుతుందా అనేది అందరి డౌట్.

- Advertisement -