- Advertisement -
వరుస సినిమాలతో జోష్ మీదున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0తో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పేటా బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ మూవీ చేస్తున్న రజనీ ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు కమిట్ అయ్యారు.
దర్బార్ తర్వాత తలైవర్ 168లో నటించనున్నారు రజనీ. సిరుతై శివ చెప్పిన కథ నచ్చడంతో రజనీ వెంటనే ఒకే చెప్పారని కోలీవుడ్ వర్గాల టాక్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టాక్.
త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. 2020 దీపావళికి సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
- Advertisement -