- Advertisement -
సర్కార్, నవాబ్ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “పెట్టా” చిత్రాన్ని “పేట” పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు ఏ సర్టిఫికెట్ పొందింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను మార్చితే యు సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ సభ్యులు చిత్ర బృందానికి తెలిపినట్లు తెలుస్తోంది.
సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ సరసన తొలిసారి సిమ్రాన్, త్రిష హీరోయిన్స్‌గా నటించగా విజయ్‌సేతుపతి, మేఘ ఆకాశ్, బాబిసింహా, శశికుమార్‌లు కీలక పాత్రల్లో నటించారు.
- Advertisement -