డ్రంక్ అండ్ డ్రైవ్… ఈ పేరు వినగానే మందు బాబులు వణికిపోతుంటారు. ముఖ్యంగా సెలబ్రేటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే.. ఇక మీడియాకి పండగేనని చెప్పాలి. ఇప్పటి వరకు హైదరాబాద్ లోని రిచ్ ఏరియాల్లో పలు సందర్భాల్లో చాలా మంది సినీ తారలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సందర్భాలున్నాయి.
అయితే అందులో మీడియా వరకు రానివి చాలానే కేసులు ఉన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఓసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడట. రీసెంట్ గా షోటైమ్ మూవీ ఆడియో వేడుకలో రాజమౌళి తనయుడు కార్తికేయ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే అది ఎప్పడు అన్న విషయం మాత్రం చెప్పలేదు.
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లారా అని ప్రశ్నించగా.. ఓ సారి తాగి డ్రైవ్ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారని కార్తికేయ తెలిపాడు. అయితే.. అప్పుడు తాగి నడపడం తప్పని తనకు తెలియదట. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి కార్తికేయ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో రూల్స్ పాటిస్తున్నాడట. అన్నట్లు ఈ షోటైమ్ సినిమాలో కార్తికేయ ఓ పాట కూడా పాడారు. మొత్తానికి రాజమౌళి కుమారుడికి అన్నింట్లోనూ మాంచి ప్రావీణ్యం ఉందని టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.