జైలర్ రజనీ తో జక్కన్న..!

30
Rajamouli
- Advertisement -

ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్ జంట గా అలరించబోతున్న బాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా “బ్ర‌హ్మాస్త్ర”. అమితాబ్ బ‌చ్చ‌న్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో మ‌ల్టీస్టార‌ర్‌గా కనువిందు చేయనున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. ఈ సినిమాకి అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ష‌న్‌ చేసిన విషయం తెల్సిందే. పాన్ ఇండియా స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, బెంగాలీ,త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక ఈ నేప‌థ్యంలో బ్ర‌హ్మాస్త్ర త‌మిళ వెర్ష‌న్ ను రాజ‌మౌళి విడుద‌ల చేయనున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చెన్నైలో ల్యాండింగ్ అయ్యారు జ‌క్క‌న్న అండ్ బ్ర‌హ్మాస్త్ర టీం. ఈ ఈవెంట్‌లో రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర సంగతి చెప్పారు. అది “తనకు ఏదో ఒక రోజు కింగ్ ఆఫ్ మాసెస్ అని అభిమానులు పిలుచుకునే సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయాల‌నుంద‌ని” చెప్పారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది బిగ్ స్క్రీన్‌పై ఏరేంజ్ లో అలరించనుందో అందరికి తెలిసిందే. ఆ థ్రిల్ కోసం అభిమానులు ఇంకా కొంతకాలం వేచిచూడాల్సిందే..

- Advertisement -