మహేష్‌తో రాజమౌళి ..’విక్రమార్కుడు 2′

252
rajamouli mahesh
- Advertisement -

మహేష్‌-రాజమౌళి కాంబినేషన్‌ సినిమా కోసం ఎగ్జయిటింగ్‌ ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. త్వరలో దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ మహేష్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. గతంలో రాజమౌళి-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన విక్రమార్కుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందీతో పలు భాషల్లో రిమేక్‌గా తెరెకిక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ రికార్డు వసూళ్లను రాబట్టింది.

ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత విక్రమార్కుడుకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట జక్కన్న. ఆ సీక్వెల్ లో మహేష్ బాబు హీరోగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మహర్షి మే9న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత మహేష్ ఎఫ్2 దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. దీని తర్వాత మహేష్-రాజమౌళి కాంబో తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది.

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ నిజంగానే మహేష్‌-రాజమౌళి కాంబోలో సినిమా వస్తే ఫ్యాన్స్‌కు పండగే కానుంది.

- Advertisement -