రాజమౌళి ఆ తప్పుని ఒప్పుకున్నాడు..

200
rajamouli talk about cameraman sainthil
- Advertisement -

ఒక సినిమా తీయాలంటే..దానికోసం కష్టపడే వారు వందల సంఖ్యలో ఉంటారు. అయితే వారందరినీ హ్యాండిల్‌ చేయాల్సింది మాత్రం ఆ సినిమా దర్శకుడే.  మరి సినిమా సెట్‌ లో దర్శకుడ ఎలా ఉండాలి? ఎలా వారందరినుంచి తనకు రావాల్సిన ఔట్ పుట్ ని రాబట్టుకోవాలి అనే విషయాల్లో రాజమౌళి కొంచెం వీకేనట.  అయితే అదంతా తాను మారకముందు.

కానీ ఇప్పడు రాజమౌళి  మారాడు. అందుకే బాహుబలి లాంటి పెద్ద సినిమాలో కూడా తాను అనుకున్న ఔట్ పుట్ ని రాబట్టుకుంటున్నాడట.
అయితే  దీనంతటికి ఒక రకంగా కెమెరామన్ సెంథిల్ కుమార్ కారణం అంటున్నాడు రాజమౌళి. గతంలో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా సెంథిల్ చెప్పిన మాటలు తనలో మార్పు తీసుకొచ్చాయని.. ఆ మాటలే ‘బాహుబలి’ పనిని కొంచెం తేలిక చేశాయని రాజమౌళి తెలిపాడు.
 rajamouli talk about cameraman sainthil
ఇంతకుముందు ఓ సినిమా షూటింగ్ సందర్భంగా యూనిట్లో వాళ్లు చురుగ్గా పని చేయట్లేదని తన ఆలోచనలకు తగ్గట్లుగా ఔట్ పుట్ రావట్లేదని కోపం తెచ్చుకున్నాడట రాజమౌళి. అంతే కాదు తెగ వారిపై అరిచేశాసేవాడట. తర్వాత సెంథిల్ తన దగ్గరికి వచ్చి అది సరికాదని,  దర్శకుడి నుంచే అందరూ ఎనర్జీ తీసుకుంటారని.. అలాంటిది దర్శకుడే అసహనం చెందితే యూనిట్ సభ్యులు కూడా డీమోరలైజ్ అవుతారని చెప్పాడట. రాజమౌళి సరిగ్గా పని చేయకపోవడం వల్లే వాళ్లు కూడా అలా చేస్తున్నారని మొహమాటం లేకుండా చెప్పాప్పేశాడట సైంథిల్‌.

కానీ రాజమౌళికి ఆ సమయంలో ఆ మాటలేమీ పట్టలేదని కానీ తర్వాత ఆలోచిస్తే నిజమేనని జక్కన్నకు  రియలైజ్‌ అయ్యాడట. అప్పట్నుంచి తన తీరు మార్చుకుని.. మనం సెట్లో ప్రతి వ్యక్తి దగ్గరికీ వెళ్లి కమ్యూనికేట్ చేయనక్కర్లేదని, సబ్ కాన్షియస్ గా వాళ్లకు మన ప్రభావం వాళ్ల మీద ఉంటుందని, మనం ఉత్సాహంతో ఉంటే వాళ్లకూ ఉత్సాహం వస్తుందని తెలుసుకున్నారట రాజమౌళి. ఇక ఆ సూత్రాన్ని పాటించడం వల్లే ‘బాహుబలి’లో ఎంత కష్టమైనా అందరూ ఇష్టంగానే చేశారని రాజమౌళి తెలిపారు.

- Advertisement -