టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తన ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. ‘బాహుబలి’ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్ ’మహాభారతం’ సినిమా చెయ్యబోతున్నాడని జక్కన్న ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘మహాభారతం’ గురించి చాలా సార్లు జక్కన్న ప్రస్తావించాడు.
‘మహాభారతం’ సినిమా తన కల అని కూడా వెల్లడించాడు. కానీ తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మహాభారతం’ సినిమా తన కల అని చెప్పానే కానీ, తాను తీస్తున్నానని మాత్రం చెప్పలేదని ప్లేట్ తిప్పేశాడు.
ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి కన్ఫార్మ్గా మహాభారతాన్ని తెరకెక్కిస్తారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జక్కన్న ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వడం సినీ లవర్స్‌ని కాస్త గందరగోళంలో పడేసిందనే చెప్పాలి.
ఇక ఇప్పటికైతే ఎలాంటి మూవీని మొదలు పెట్టలేదని, ప్రస్తుతం బాహుబలి-2 సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, కొంతకాలం తర్వాత తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు దర్శకుడు రాజమౌళి.
అయితే …కలలు కనేవారే దాన్ని సాకారం చేసుకోడానికి ట్రైచేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ జక్కన్న విషయానికొస్తే మాత్రం ..కల తనది.. సాకారం ఇంకొరిదన్నమాట అనుకుంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఈ టాప్ డైరెక్టర్ రాజమౌళి చెప్పిన మాటాల్లో ఫ్యాన్స్ లో చాలా డౌట్సే మొదలవుతున్నాయనే చెప్పక తప్పదు మరి.!