SSMB29:మహేష్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

17
- Advertisement -

మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమా కోసం నిర్మాత ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జక్కన్న ఏకంగా రూ.200 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఇది మహేష్ బాబు రెమ్యూనరేషన్ కంటే ఎక్కువని తెలుస్తోంది.

Also Read:శర్వా సినిమాలో అనుపమ!

ఇక ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను ఆఫ్రికాలో చేయనున్నారు మేకర్స్. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్తైన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది.

- Advertisement -