వెంకీపై జక్కన్న ప్రశంసలు..

214
Rajamouli Reacts On Tholi Prema
- Advertisement -

దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకొన్నారు వెంకీ అట్లూరి. ‘స్నేహగీతం’తో నటుడిగా మెరిసిన ఆయన ఆ తర్వాత మెగాఫోన్‌పై ప్రేమ పెంచుకొన్నారు. ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’, ‘కేరింత’ చిత్రాలకి రచయితగా పనిచేసిన ఆయన, ‘తొలిప్రేమ’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. వరుణ్ తేజ్, రాశి ఖన్నా జోడీగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ అందమైన ప్రేమకథను తెరకెక్కించిన వెంకీ అట్లూరిపై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి దిగ్గజ ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా చేరిపోయారు. తాను ప్రేమ కథలను పెద్దగా అభిమానించే వాడిని కాకపోయినప్పటికీ, ‘తొలిప్రేమ’ సినిమాని చూసి మాత్రం ఎంజాయ్ చేశానని తెలిపారు.

Rajamouli Reacts On Tholi Prema

దర్శకుడు వెంకీ తన తొలి సినిమాని బాగానే హ్యాండిల్ చేశారని రాజమౌళి ప్రశంసించారు. హీరో వరుణ్ తేజ్ తన నటనా సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతున్నాడని, రాశీఖన్నా బ్యూటిఫుల్ గా కనిపించడంతో పాటు బాగా నటించిందని చెప్పారు. ప్రసాద్, బాపినీడుల నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని, వారికి అభినందనలు తెలుపుతున్నానని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు.

- Advertisement -