జై రావణ…జై ఎన్టీఆర్

212
Rajamouli prasies NTR’s Jai Lava Kusa
- Advertisement -

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మూడు(జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన జై లవకుశ హిట్ టాక్‌ సంపాదించుకుంది.

జై నామస్మరణతో థియేటర్స్ మారు మ్రోగుతుండగా, ఎన్టీఆర్ నటనికి అభిమానులు జై..జై..లు పలుకుతున్నారు. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి ఫిదా అయ్యారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తాడు. తార‌క్‌.. నా హృదయం అపారమైన గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎన్టీఆర్ నటనకి పదాలు లేవు.. జైజై అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

తమకు ఇదే నిజమైన దసరా పండుగ అంటూ థియేటర్స్ వద్ద బాణాసంచా కాల్చుతూ హల్ చల్ చేస్తున్నారు. అసుర .. అసుర.. అసుర.. అసుర.. అంటూ ఎన్టీఆర్ రావణుడిగా భయపెట్టేశాడని.. ఆ రావణుడ్ని చంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా.. ఉందా…’ అంటూ ‘జై’ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ నుండి ఎక్కువగా వినిపిస్తున్నాయి.

- Advertisement -