థ్యాంక్యూ కెప్టెన్

213
Rajamouli praises Nene Raju Nene Mantri
- Advertisement -

తేజ దర్శకత్వంలో  రానా హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా సినిమాపై ప్రశంసలు గుప్పించారు.

చాలా కాలం తర్వాత ఓ అర్థవంతమైన చిత్రం వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి చిత్ర బృందానికి శుభాకాంక్షలు’, ‘కాజల్ బాగుంది. కేథరిన్ కూడా. కట్టిపడేసే ప్రారంభ సన్నివేశాలు, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాలో ముఖ్యమైన భాగాలు’,‘ తేజ గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రతి నటి చాలా బాగా చేశారు … నా భళ్లాలదేవాను చూసి చాలా గర్వపడుతున్నాను’ అంటూ రాజమౌళి ప్రశంసించారు.

రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా కితాబిచ్చిన కొంచెం సేపటికే రానా స్పందించారు. ట్విట్టర్ ద్వారా రానా రిప్లై ఇస్తూ..‘థ్యాంక్యూ కెప్టెన్!! నేను కొత్త పాత్రల్లో నటించేందుకు ప్రయత్నించడానికి.. భళ్లాలదేవా పాత్ర నాకు ఒక ఆయుధం లాంటిది!! నేనే రాజు నేనే మంత్రి సినిమా మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది!’ అని అన్నాడు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ, చూడాలని నిర్ణయించుకున్నవారికి నా ధన్యావాదాలు, మూసధోరణి తెలుగు సినిమాలను ఈ సినిమా బ్రేక్ చేసింది. కేవలం ప్రేక్షకుల, అభిమానుల మద్దతు వల్లే ఈ తరహా వినూత్న పాత్రలను పోషిస్తాను’ అని రానా ఆయా ట్వీట్లలో పేర్కొన్నాడు. చాలా ధన్యవాదాలు సార్… అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిప్లై ఇచ్చింది కాజల్.

- Advertisement -