మహాభారతంపై జక్కన్న క్లారిటీ..

181
- Advertisement -

బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తన బాహుబలి 2 చిత్రం పనులు పూర్తి చేసి విడుదల చేసే పనిలో ఉన్నాడు.మరి ఈ సినిమా తరువాత తను ‘మహాభారతం’ సినిమాని తెరకెక్కింస్తాడని ఫిలిం నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది.ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.ఈ సందర్భం లో జక్కన్న తాజాగా ఒక ఇంటర్వూలో  షాకింగ్ న్యూస్‌ చెప్పాడట.

Rajamouli Next Movie Mahabharata

‘మహాభారతం’ మూవీ విషయంలో వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఈ  సినిమా ఇప్పట్లో  తెరకెక్కించే ఆలోచనే లేదని జక్కన్న స్పష్టం చేశాడు. అంతేగాదు మహాభారతం సినిమా తీయాలంటే దానికి ఇంకా అనుభవం కావాలి ఈ సినిమాని ఇప్పడే తీసేంత అనుభవం లేదని చెప్పుకోచాడు రాజమౌళి. మహా భారతం సినిమా తీయాలంటే కనీసం పది సంవత్సరాలైన పడుతుంది అన్నారు.

రోజు రోజు కి టెక్నాలజీలో మార్పు వస్తుందని … ఈ సినిమా తెరకెక్కించే సమయానికి  ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూసి దానికి తగినట్టుగా తెరకెక్కించాలని తెలిపారు. దీంతో కొంతకలాంగా రాజమౌళి మహాభారాతం మూవీని తెరకెక్కిస్తారని … ఇందులో బాలీవుడ్ స్టార్లతో పాటు టాలీవుడ్ అగ్రహీరోలు నటిస్తారన్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లయింది.

- Advertisement -