ఎన్టీఆర్ తో మళ్లీ రాజమౌళి

31
- Advertisement -

స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ కోసం మరో కథ సిద్ధం చేస్తున్నారట. అన్నీ కుదిరితే ఎన్టీఆర్ తో రాజమౌళి మరో మూవీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ప్రతి స్టార్ ఫ్యాన్స్ తమ హీరో రాజమౌళితో మూవీ చేయాలని కోరుకుంటారు. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో తన పేరిట బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదు చేసుకుంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్, పవన్, అల్లు అర్జున్ లతో రాజమౌళి చిత్రాలు చేయలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఒక్కో చిత్రానికి రెండు మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో అందరు స్టార్స్ తో సినిమాలు చేయడం సాధ్యం కావడం లేదు. కాకపోతే, ప్రస్తుతానికి మహేష్ తో మూవీ కుదిరింది. ఈ విషయాన్ని రాజమౌళి, మహేష్ ధృవీకరించారు. స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ ఫ్యాన్స్ కల కూడా తీరుతున్న తరుణంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ లో తమ హీరోకి రాజమౌళి అన్యాయం చేశాడు అంటూ కామెంట్స్ చేశారు. కాబట్టి, రాజమౌళి ఎన్టీఆర్ తో మరో సోలో భారీ మూవీ తీస్తాడు అంటూ ఆశ పడ్డారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ పై ప్రత్యేక అభిమానం కలిగిన విజయేంద్ర ప్రసాద్, ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారట. ఆ కథను రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాలని భావిస్తున్నారట. అన్నీ కుదిరితే మహేష్ బాబు మూవీ తర్వాత రాజమౌళి చేసేది ఎన్టీఆర్ తోనే అంటున్నారు. మరి ఇదే నిజమైతే బాక్సాఫీస్ షేక్ కావలసిందే. ఇప్పటివరకూ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో రిపీటెడ్ గా సినిమాలు చేసిన రాజమౌళి.. మళ్లీ ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ సినిమా ఏ జోనర్ లో ఉంటుందో చూడాలి.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -