ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఇటీవల హాలీవుడ్ మీడియా సంస్థ పాలిగాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తన చివరి చిత్రం RRR గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ వెల్లడించారు. RRRకి అనిమే అడాప్టేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నానని ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలు జపాన్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా అధికారికంగా ఏమీ ప్రారంభం కాలేదని చెప్పారు. అనిమేకు బాగా అలవాటుపడ్డ రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయానికి అనిమే ప్రేమికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం వారణాసి షూటింగ్ దశలో ఉంది. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పటికే విడుదలయ్యాయి.
Also Read:TTD:మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం
ప్రపంచమంతా తిరిగే ఈ చిత్రం శ్రీ దుర్గా ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

