ఆస్కార్‌ అకాడమీ సభ్యులుగా జక్కన్న దంపతులు..

12
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలోనే అత్యున్నత అవార్డులైన ఆస్కార్‌ అకాడమీ సభ్యులుగా రాజమౌళి దంపతులు ఎన్నికయ్యారు. దర్శకుల కేటగరిలో రాజమౌళి,కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ విభాగంలో రమా రాజమౌళి ఎంపికయ్యారు. 2025 ఆస్కార్‌ అవార్డులను ఎంపిక చేయనున్నారు సభ్యులు.

మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాని మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా ఇందులో వీరిద్దరికి కూడా అకాడమీ వారు ఆహ్వానం పలికారు. ఇది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ప్రైడ్ మూమెంటనే చెప్పాలి.

బాహుబలి,ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచమే మన వైపు చూసేలా చేశారు జక్కన్న.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది.

Also Read:Kaushik Reddy:పొన్నం నుండే బ్లాక్ బుక్‌ స్టార్ట్

- Advertisement -