రాజకపోతాసనంతో ఉపయోగాలు!

10
- Advertisement -

రాజకపోతసనం దీనినే పావురం భంగిమ అని కూడా అంటారు. కూర్చొని వేసే ఆసనాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆసనంలో ఛాతీ భాగం ముందుకు నెట్టబడుతుంది. అందుకే దీనికి పావురపు భంగిమ అనే పారు వచ్చింది. ఈ ఆసనం వేయడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అన్నీ ఆసనాలలోకెల్లా ఈ ఆసనం రాజు వంటిదని యోగా నిపుణులు చెబుతుంటారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల మోకాళ్ళు, మోచేతులు, తొడ కండరాలు, భుజాలు.. ఎంతో శక్తివంతంగా తయారవుతాయి. ఛాతీ విశాలమౌతుంది. గొంతు నొప్పి, వంటి సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్యకు చెక్ పడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. స్త్రీలలో రుతుక్రమ సమస్యలతో పాటు ఇతర గర్భకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంక వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తద్వారా వెన్నునొప్పి దూరం అవుతుంది. ఈ ఆసనం రక్తపోటును కంట్రోల్ లో ఉంచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుందని పలు అధ్యయనలు చెబుతున్నాయి. ఇంకా మూత్రపిండాలు, కాలేయం, మూత్రాశయం వంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

ముందుగా వజ్రాసనం లో కూర్చిని వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత కుడి కాలిని పూర్తిగా వెనుకకు చాపి. నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులను పైకి లేపి మోచేతుల దగ్గరకు వంచి తలను ఫోటోలో చూపిన విధంగా వెనుకకు వాల్చాలి. ఇదే సమయంలో కుడి మోకాలిని వంచి అరికాలును తల నుదురుభాగానికి తాకించలి. తలమీద ఉన్న కుడిపాదాన్ని రెండు చేతులతో ఫోటోలో చూపిన విధంగా పట్టుకోవాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడూ చూపు ఆకాశం వైపు చూస్తూ శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి. ఛాతీ భాగం ముందుకు నెట్టిఉండాలి.. ఈ భంగిమలో వీలైనంత సమయం ఉన్న తరువాత మళ్ళీ ఎడమకాలితో కూడా ఇదే విధంగా చేయాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదు సార్లు ఈ ఆసనం సాధన చేయాలి.

స్పాండిలోసీస్, హైబీపీ ఉన్నవాళ్ళు ఈ అసహ్నం వేయరాదు. మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆసనం వేయరాదని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:మల్లెపూల టాక్సీ..లిరికల్ సాంగ్

- Advertisement -