మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు రాజగోపాల్. కాంగ్రెస్ పార్టీలో చేరికపై సంప్రదింపులు జరిపినిట్లు సమాచారం. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని రేవంత్ కోరిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం పెరిగింది. నిన్న మొన్నటి వరకు అంతర్గత విభేదాలతో సతమతమైన టీ కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి సమిష్టిగా ముందుకుసాగుతున్నారు. ఇటీవల ఖమ్మం జనగర్జన సభ విజయవంతం కావడంతో పార్టీని వీడిన నేతలంతా తిరిగి సొంతగూటి వైపు చూస్తున్నారు.
Also Read:Harishrao:సీఎం కేసీఆర్ సంకల్పం ఇదే
కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు రాజగోపాల్ రెడ్డి. ఎంపీగా,ఎమ్మెల్సీగా,ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
Also Read:తెలంగాణకు కిషన్ రెడ్డి..ఏపీకి పురందేశ్వరి