- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుండి అడుగడునా వ్యతిరేకత వస్తోంది. ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతలను ఎక్కడికక్కడా నిలదీస్తున్నారు ప్రజలు. తాజాగా చౌటుప్పల్ మండలం చిన్నకొండుర్ గ్రామంలో మొన్న ఆయన సతీమణిని నిలదీయగా ఆదివారం రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి గ్రామంలోకి రాగానే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా గ్రామస్థులు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. బీజేపీ డౌన్ డౌన్ , కాంట్రాక్టులు కోసం కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ప్రజలకు ద్రోహం చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. నిరసనకు దిగిన వారిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో స్ధానికుల నుండి బీజేపీ తీరుపై తీవ్ర నిరసన వస్తోంది.
- Advertisement -