- Advertisement -
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘ది రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హారర్ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
థ్రిల్ చేసే అంశాలతో రాజా సాబ్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న బిజినెస్ కూడా ప్రేక్షకులను, సినీ సర్కిల్స్‌ను స్టన్ చేస్తోంది. తాజాగా రాజాసాబ్ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ సంస్థ టి సిరీస్ రాజాసాబ్ ఆడియో రైట్స్‌ను ఈ భారీ మొత్తానికి దక్కించుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read:Kavitha:17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్‌రోకో
- Advertisement -

