రాజా మీరు కేక … ట్రైలర్

204
Raja meru keka Theatrical Trailer
- Advertisement -

ఆర్‌కె స్టూడియోస్ గుంటూరు టాకీస్  సినిమా తర్వాత  నిర్మించిన రెండవ చిత్రం ‘ రాజా మీరు కేక’. ఇవాళ రధ సప్తమి సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు.  ఈ సందర్బంగా సురేష్ బాబు  మాట్లాడుతూ ఈ సినిమా దర్శకులు కృష్ణ కిశోర్ తమ సంస్థలో పలు విజయవంతమైన చిత్రాలకు కో- డైరెక్టర్ గా పనిచేసారు. దర్శకుడిగా తన మొదటి సినిమా విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ, దర్శకులు కృష్ణ కిశోర్ గారికి, నిర్మాత రాజ్ కుమార్ గారికి మరియు ఈ సినిమాలో  నటించిన నటీనటులకు అబినందనలు తెలియచేశారు.

చిత్ర నిర్మాత రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ తమ మొదటి సినిమా గుంటూరు టాకీస్ విజయం తర్వాత నిర్మించిన  “రాజా మీరు కేక” సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని తెలిపారు. సినిమాలో నటించిన రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య శోభితలతో పాటు ముఖ్య పాత్రలో నటించిన  నందమూరి తారకరత్నకు కృతజ్ఞతలు తెలిపారు.  థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసిన సురేష్ బాబుకి దన్యవాదాలు తెలిపారు.

చిత్ర దర్శకుడు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ తనను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న సురేష్ బాబు  తన మొదటి సినిమా ధియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తనకు సహకరించిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు దన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, లాస్య మాట్లాడుతూ మంచి సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారని, ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, తమకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కుమార్, దర్శకులు కృష్ణ కిశోర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత : రాజ్ కుమార్, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, స్టంట్స్: జాషువ.

- Advertisement -