కారు యాక్సిడెంట్ పై స్పందించిన రాజ్ తరుణ్

673
Raj Tharun Car Accident
- Advertisement -

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన అనంతరం రాజ్ తరుణ్ అక్కడి నుంచి పరగెత్తడం సీసీటీవి కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ప్రమాదం జరిగిన తర్వాతి నుంచి రాజ్ తరుణ్ అజ్నాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా తాజాగా ఈఘటనపై ట్వీట్టర్ ద్వారా స్పందించారు హీరో రాజ్ తరుణ్.

నా ఇంటి నుంచి నార్సింగి సర్కిల్ రోడ్డుపై కారులో వెళ్తున్నాను. అక్కడ ఓ యాక్సిడెంట్ స్పాట్ గత మూడు నెలల నుంచి వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేను అటునుంచి వెళ్తున్నప్పుడు సడెన్ గా రైట్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా నాకేమీ అర్థం కాక పట్టు కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టేశాను. ఆ శబ్దానికి నా చెవులు బ్లాంక్ అయిపోయాయి. చూపు మసకగా మారింది. అకస్మాత్తుగా హార్ట్ బీట్ పెరిగి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.

సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. ఒక్కసారి నన్ను నేను చూసుకుని..ఆపై సహాయం కోసం అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఆరోజు ఇదే జరిగిందన్నారు. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నా..తర్వలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపారు. ఈఘటన జరిగిన తర్వాత నాకు చాలా మంది ఫోన్లు, మెసెజ్ లు చేస్తున్నారు..నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -