మరోసారి విరించి వర్మతో రాజ్ తరుణ్!

625
Raj Tharun
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఉయ్యాలా జంపాలా సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు విరించి వర్మ. ఈసినిమా విజయం సాధించడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈసినిమా తర్వాత దర్శకుడు విరించి వర్మ నేచురల్ స్టార్ నానితో మజ్ను మూవీని తెరకెక్కించాడు. ఈమూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా దర్శకుడు విరించి వర్మ తన తర్వాతి మూవీని కళ్యాణ్ రామ్ తో చేయనున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ తాను కమిట్ మెంట్ అయిన ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో అంతలోపు వేరే హీరోగా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

తాజాగా హీరో వరుణ్ తేజ్ కి కథ వినిపించాడట దర్శకుడు విరించి వర్మ. అయితే ఈ కథకి సంబంధించి వరుణ్ తేజ్ ఇంతవరకూ తన అభిప్రాయం చెప్పలేదట. ఒకవేళ వరుణ్ తేజ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే రాజ్ తరుణ్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో విరించి వర్మ ఉన్నాడని చెబుతున్నారు. రాజ్ తరుణ్ కి కూడా కథ వినిపించాడట. త్వరలోనే ఈప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

- Advertisement -